PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్‌ ఇచ్చాడు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు. ఓవర్‌సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్‌ సంధు సినిమా రిలీజ్‌కు ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ చూసేశానంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. ‘భారతీయ సినిమా పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవచ్చని నిరూపించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రాన్ని ఎవరూ మిస్‌ కాకుండా చూసి తీరాల్సిందే! ఇప్పుడు దీన్ని బ్లాక్‌బస్టర్‌ అని చెప్పుకున్నా రేపటి తరానికి మాత్రం ఇదొక క్లాసిక్‌గా మిగిలిపోతుంది. చరణ్‌, ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించారు. వారి కాంబినేషన్‌ అదిరింది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజీలా కనిపిస్తాడు. ఆలియా భట్‌ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది’ అని ఉమైర్‌ సంధు ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ చిత్రంతో రాజమౌళి ఇండియాలోనే నెంబర్‌ 1 డైరెక్టర్‌గా మారిపోతాడంటూ ఉమైర్‌ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తూ మరో ట్వీట్‌ చేశాడు.

                                      

About Author