PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌రో 30 దేశాల‌లో `ఆర్ఆర్ఆర్` సినిమా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను మరో 30 దేశాలలో రిలీజ్ చేబోతున్నట్టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా 14 భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువగానే వసూళ్ళు రాబట్టి ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరో 30కి పైగా వివిధ దేశాలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చరణ్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్‌లో జపాన్‌లో విడుదలవుతుందని, ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్ – ఎన్టీఆర్‌తో సహా యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తామని తెలిపారు. ఈ సినిమాను చైనాలో కూడా విడుదలచేసే అవకాశం ఉందని అన్నారు.

                                

About Author