NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`ఆర్ఆర్ఆర్` వాయిదా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే… ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ఆర్ఆర్ఆర్ సినిమాని చిత్ర‌బృందం వాయిదా వేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పటికే దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలో సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ టికెట్‌ ధరల వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విష‌యం పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

                                               

About Author