PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఖరారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ ఖరారైంది. గతంలో జనవరి 7న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ.. కరోన కారణంగా వాయిదా పడింది. అయితే.. చిత్ర బృందం తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. కరోన ప్రభావం తగ్గితే సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. లేనిపక్షంలో ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత. పాన్ ఇండియా మొత్తం ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ట్రైలర్ అభిమానుల అంచనాల్ని పెంచేసింది.

           

About Author