PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్.. ఐదు థియేట‌ర్ల‌లోనే స్పెష‌ల్ షో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక అనుమతిని జారీ చేసింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ అభ్యర్థన మేరకు మార్చి 25 ఉదయం 1 లేదా 3 గంటల సమయంలో ప్రదర్శించుకునేందుకు ఓ ఐదు థియేటర్లకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్, కూకట్‌పల్లిలో ఉన్న భ్రమరాంబ, విశ్వనాధ, అర్జున్, మల్లిఖార్జున థియేటర్లతో పాటు.. మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో స్పెషల్ షో ద్వారా సినిమాని ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే. అంతకుముందు రోజూ 5 షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐదు థియేటర్లలో మాత్రం మార్చి 25వ తేదీన 6 షోలు పడనున్నాయి. ఈ స్పెషల్ షోకి సినిమా టికెట్ ధర ప్రత్యేకంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

                                             

About Author