NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`ఆర్ఆర్ఆర్` ఎన్టీఆర్, చ‌ర‌ణ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్ తో ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ. దాన‌య్య ఈ చిత్రం నిర్మించారు. అన్నీ కలుపుకొని ఇప్పటికే దాదాపు 900 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇందులో కొమురం భీమ్ పాత్రను పోషించిన ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్‌ల ఒక్కొక్కరికి 45 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌గా అందినట్టు సమాచారం. అలాగే, ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్ దేవగణ్ 25 కోట్లు, అలియాభట్ 9 కోట్లవరకు అందుకున్నారట. ఇక చిత్ర దర్శకుడు రాజమౌళి రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో 30 శాతం వాటా తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.

                                     

About Author