రాష్ట్రగవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ‘‘ఆర్యూ వీసీ’’
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ వి.సి.గా నియమితులైన తర్వాత ఈరోజు రాజభవన్లో వర్సిటీ ఛాన్స్లర్ మరియు రాష్ట్రగవర్నర్ శ్రీ ఎస్, అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిసి దన్యవాదాలు తెలిపినట్లు వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. రాయలసీమ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రాజ్భావన్ సహాయసహకారాలు ఉంటాయని వర్సిటీ ఛాన్స్ లర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వర్సిటీలో విద్యాప్రమాణాలు మెరుగుపరచడంపై దృష్టిసారించాల్సిందిగా ఛాన్స్లర్ సూచించారన్నారు. విద్యారంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లాను ఉన్నతస్థానంలో నిలిపేందుకు కృషిచేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారని తెలిపారు. జిల్లాలో ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి వర్సిటీ చేపట్టే చర్యలకు రాజ్భవన్ పూర్తిగా సహకరిస్తుందన్న హామీపట్ల వి.సి. ఆచార్య వెంకట బసవరావు హర్షం వ్యక్తంచేశారు.
