NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ‌తికుండ‌గానే స‌మాధి..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: జ‌గిత్యాల జిల్లాలోని ఓ వ్యక్తి నిర్ణయం అంద‌రినీ ఆశ్చర్యప‌రుస్తోంది. బ‌తికుండ‌గానే ఆయ‌న స‌మాధి నిర్మించుకున్నారు. అప్పుడ‌ప్పుడు ఆ స‌మాధిని శుభ్రం చేస్తూ.. పిచ్చి మొక్కలు తీసేస్తూ క‌నిపిస్తారు. జ‌గిత్యాల మండ‌ల ప‌రిధిలోని ఇంద్రయ్య అనే వ్యక్తి తాను బ‌తికుండ‌గానే స‌మాధి నిర్మించుకున్నారు. అది కూడ 20 ఏళ్ల క్రితం. ఆయ‌న భార్య మృతి చెంద‌గా… ఆమె స‌మాధి ప‌క్కనే ఇంద్రయ్య కూడ స‌మాధి నిర్మించుక‌న్నారు. స‌మాధులు రాతితో నిర్మాణం చేశారు. ఎంత సంపాదించిన చేరేది ఇక్కడికేన‌ని.. అందుకే ముందుగా తాను స‌మాధి నిర్మించుకున్నట్టు ఆయ‌న తెలిపారు. త‌న కుమారులు క‌ష్టప‌డ‌కుండా.. స‌మాధి మీద బండ‌తీసి లోప‌లికి పెడితే స‌రిపోతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కానీ.. చుట్టుప‌క్కల వాళ్లు మాత్రం ఆయ‌న నిర్ణయం ప‌ట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

About Author