సమాజ్ వాదీ పార్టీ ఉగ్రవాదులకు మద్దతు తెలిపింది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఓడిపోక తప్పదని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు అధికారం కోసం తన తండ్రిని ఓ వేదిక పైనుంచి తోసేసిన అఖిలేశ్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారని, అందుకు ములాయం మద్దతుతో ముందుకు సాగుతున్నారని ఎద్దేవా చే శారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్దోయ్‌లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఓ నిందితుడికి సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలున్నాయి. సంకట్ మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లలో పేలుళ్లకు పాల్పడ్డ షమీమ్ అహ్మద్‌పై కేసు కొట్టివేయించేందుకు ఎస్పీ ప్రయత్నించింది. అయోధ్య, లఖ్‌నవూల్లో 2007లో జరిగిన పేలుళ్ల కేసు నిందితుడు తాఖిర్ కాజిమ్‌పై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించేందుకు యత్నించింది. మరో 14 ఉగ్ర కేసుల్లో ఉపసంహరణలకు ప్రయత్నాలు చేసింది’’ అంటూ మోదీ విరుచుకుపడ్డారు.