PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సమంత

1 min read


పల్లెవెలుగు వెబ్: చైతూతో విడాకుల అనంతరం సమంత పుల్ స్వింగ్ లో ఉంది. వరస‌బెట్టి సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవల ఓ బాలీవుడ్ చిత్రానికి ఒకే చెప్పిన సామ్.. తాజాగా ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ‘‘డౌన్ టౌన్ యాబీ’’ సిరీస్ డైరెక్టర్ ఫిలిప్ జాన్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో సామ్ నటించబోతుంది. భారతీయ నవలా రచయిత తిమేరి ఎన్.మురారి రచించిన ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా.. అదే పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని సామ్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ఓ కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నట్లు సమంతా ఇన్ స్టాలో రాసుకొచ్చింది.‘‘ 2009లో తొలిసారి ‘ ఏ మాయ చేసావే’ సినిమా అడిషన్స్‌‌లో పాల్గొన్నా. తరువాత మళ్లీ 12 ఏళ్ల తరువాత ఆడిషన్స్‌లో పాల్గొంటుంటే ఏదో తెలియని ఆందోళన నెలకొంది.’ అని సమంత పేర్కొంది. కాగా, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌‌లో బోల్డ్‌గా నటించిన సమంత.. ఈ హలీవుడ్ సినిమాలో బై సెక్సువల్ పాత్రలో మెప్పించనున్నట్లు సమాచారం.

About Author