సేవ్ ఆర్డీటి …సేవ్ పూర్ పీపుల్ కార్యక్రమం
1 min read
న్యూస్ నేడు హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటి సేవ్ పూర్ పీపుల్ కార్యక్రమం లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ మహనీయుడు ఫాదర్ ఫేర్రర్ గ అనంతపురం జిల్లా లో 1969 సంవత్సరం లో చిన్న చినుకుగా మెదలైన ఈ మహా యజ్ఞం నేడు దాదాపు మూడు జిల్లా లో విస్తరించి పేదల పాలిట సంక్షేమ ప్రధాయినిగ మారింది ఆరోగ్యం బాలేదు మన ఆర్డీటి ఉంది చదువు కోవాలనుంది మన ఆర్డీటి ఉంది ఇల్లు కట్టుకోవాలని ఉంది దానికి మన ఆర్డీటి ఉంది ప్రతి పెద్దవాళ్లకు మన ఆర్డీటి అండ ఉంది కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ నిలిపివేయడం తో అనేక మూడు జిల్లా లో 4.50లక్షలమంది ఇబ్బంది పడతారు కావున కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసి ఆర్డీటి సేవలు కొనసాగించాలిని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం లో రాజా ఈరన్న వెంకటేష్ ఈరన్న అలీ గదిలింగ ,సుమన్నా తదితరులు పాల్గొన్నారు.