శిలాఫలకంపై మంత్రి సవితమ్మ పేరు లేకపోవడం చాలా భాదకరం
1 min read
కర్నూలు జిల్లా కురువ సంఘం
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కు ఫ్రారంభ కార్యక్రమం శిలాఫలకంపై మంత్రి సవితమ్మ పేరు లేకపోవడం చాలా భాదకరమని కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి కర్నూలు టౌన్ ప్రసిడెంట్ తవుడు శ్రీనివాసులుజిల్లా ప్రచారకార్యదర్శి బి. సి. తిరుపాల్ అన్నారు. కురువ కులస్తు రాలైన బిసి మహిళను మంత్రి హోదాలో కూడా అవమానపరచడం భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వేదికపై ఉన్న ప్లేక్సిలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఫోటో మరియు పేరు లేకపోవడం కురువ కులజులను అవమానించడమేనని ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . మా ఓట్లు మాత్రమే కావాలా?మమ్మల్ని కించపరిచే విధంగా అధికారులు చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న మిగతా మంత్రులు కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బిసిలకు పెద్ద పీట వేసి సముచితం స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు ని అవమానించడమే నని వారు అన్నారు. ఈ పోరపాటుకు కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.