ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు భారీగా పెంచిన ఎస్బీఐ
1 min read
పల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారికి శుభవార్త తెలిపింది. భారీగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లు పెంచింది. తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తన వెబ్‌సైట్‌లో తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. కొత్తగా పెంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని తాజా ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.