ఇది అసమర్థ ప్రభుత్వం : సీబీఎన్
1 min read

పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని టీడీపీ నేత చంద్రబాబు విమర్శించారు. తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆయన మాట్లాడారు. అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. మహాపాదయాత్రలో పాల్గొన్నవారిపైనా కేసులు పెట్టారని తెలిపారు. అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా జగన్‌రెడ్డి మాట తప్పారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చెప్పారు.

