పిల్లల మనో వికాసానికి సైన్స్ ఫెయిర్‌లు ఎంతగానో దోహదపడతాయి…
1 min read
టిడిపి యువ నాయకుడు ముల్లా మోయిన్…
అయేషా సిద్ధిఖా ఉర్దూ పాఠశాలలో ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్…..
పల్లెవెలుగు ,హోళగుంద: విద్యార్థుల మనోవికాసానికి సైన్స్ ఫెయిర్ లు ఎంతగానో దోహదపడతాయని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ముల్లా మోయిన్ అన్నారు.హోళగుంద మండల కేంద్రంలోని అయేషా సిద్ధిఖా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబూబకర్ ఆధ్వర్యంలో మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు పలు ఆసక్తికరమైన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. బయోడైవర్సిటీ అండ్ కన్సర్వేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ,జీర్ణ వ్యవస్థ,రక్త ప్రసరణ వ్యవస్థ, వంటి వివిధ ఎగ్జిబిట్లను ఏర్పాటు చేసి ఎంతో చక్కగా వివరించారు. ఈ సైన్స్ ఫెయిర్ కు విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు, మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. వాటికి సంబంధించిన విశేషాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రంతో పాటు హోం సైన్స్ విభాగాల్లో రూపొందించిన పరికరాలు, నమూనాలు, వాటి పనితీరును విద్యార్థులు వివరించారు. సైన్స్ ఫెయిర్ కు వచ్చిన ప్రతి ఒక్కరు అయేషా సిద్ధిఖా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ల ప్రదర్శన, విద్యార్థులు ప్రాజెక్టులను వివరించడాన్ని సైన్స్ ఫెయిర్ కు హాజరైన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.. విద్యార్థులకు ఇలాంటి జ్ఞానాన్ని అందిస్తున్న అయేషా సిద్ధిఖా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను ప్రశంసించారు.అదేవిధంగా మదరసా అయేషా సిద్దిఖా మదర్సా విద్యార్థులు ప్రదర్శించిన ఇస్లామిక్ ఎగ్జిబిట్లు ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.