PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు..

1 min read

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు డివిజన్ పరిధిలోని మిడుతూరు మండలంలోని వీపనగండ్ల, చెరుకుచెర్ల, మిడుతూరు గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలతో కాపులేని పత్తి పొలాలను నందికొట్కూరు ఏడీఏ విజయ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణి, డా.శ్రీలక్ష్మి పరిశీలించారు.వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి పంటను కంటికి రెప్పలా కాపాడుకొన్నామని, తీరా పత్తి మొక్కలకు కాపు రాకపోయేసరికి కంగుతిన్నామని రైతులు మొరపెట్టుకొన్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు శాస్త్రవేత్తలను కోరారు.నందికొట్కూరు డివిజన్ పరిధిలోని మిడుతూరు మండలంలో రైతులు దాదాపుగా 6వేల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. ఇందులో నూజివీడు గోల్డ్, మైకా, వింధ్య, జాదు కంపెనీ కి చెందిన పత్తి విత్తనాలను సాగుచేసిన పంట దెబ్బతిందని రైతులు ఆందోళన చేపట్టారు.400ఎకరాల్లో నకిలీ పత్తి విత్తనాలతో మోసపోయామని గ్రహించి వ్యవసాయ అధికారులను ఆశ్రయించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్ల పై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరారు. గురువారం శాస్త్రవేత్తల బృందం పత్తి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డా.సుధారాణి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో దెబ్బతిన్న పత్తి పంటలను మూడు రోజులుగా పరిశీలించి నివేదికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. పత్తి పంట సాగుచేసి 125 రోజులు గడచిన చెట్టుకు కాయ, పూత రాలేదని పరిశీలించిట్లు తెలిపారు. జిల్లాలో పత్తి పంట దెబ్బతిందని, పంట ఆశాజనకంగా లేదన్నారు.దాదాపు 20 కంపెనీలకు చెందిన సాగుచేసిన పత్తి పంటను పరిశీలించామని అన్నారు. రైతులు న్యాయం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి టి.మోహన్ రావు, మండల వ్యవసాయ అధికారి వీరు నాయక్, కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

About Author