త్వరలో ఆర్జీవీ రాజకీయ `వ్యూహం` !
1 min readపల్లెవెలుగువెబ్: రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. అతి త్వరలో రెండు పార్టులతో రాజకీయ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. మొదటి పార్టు టైటిల్ ‘వ్యూహం’ అని, రెండో పార్టు టైటిల్ ‘శపథం’ అని తెలిపారు. ఈ రెండు భాగాల్లోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఇది రాజకీయ సినిమా అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉంటాయేమో కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయని వెల్లడించారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే ‘వ్యూహం’ కథ అని రామ్ గోపాల్ వర్మ వివరించారు. ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ‘వ్యూహం’ చిత్రం ఉంటుందని తెలిపారు.