ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించనున్న ఎస్డీపీఐ
1 min read
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: పార్టీ అధ్యక్షుడు హమీద్
హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా హొళగుంద మండలానికి సంబంధించిన ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతూ, కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, స్థానికంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కే. సలాం, పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి హఫీజ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


