ఊరా వల్ల కాడ .. సీజనల్ వ్యాధులు ఆపై దుమ్ముధూళి..
1 min readఅయ్యా కలెక్టర్ గారు జర స్పందించరూ…
పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల కేంద్రమైన గడివేముల వ్యాధులకు నిలయంగా కుక్కలకు పందులకు కోతులకు ఆవాసంగా మారిపోయింది అధికారులు లేని మండలం ఉన్న పని చేయలేని మండలంగా మారిపోయింది. శుక్రవారం వస్తే గ్రామంలోని ముస్లిం కాలనీలో నీళ్లు రావు . ఎమ్మెల్యే కలెక్టర్ వస్తే గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు వర్షం పడి తర్వాత ఎండ వస్తే రోడ్డుపై ఉన్న దుమ్ముధూళి ఊపిరితిత్తులు చర్మ వ్యాధులను కలగజేస్తుంది ఇక దోమలకు ఫాగింగ్ చేయడం మండలంలో ఎప్పుడు చూడలేదు ఇక కుక్కలైతే బీసీ కాలనీలో ఏడు మందికి కరిచిన ఇప్పటివరకు పంచాయతీ అధికారుల స్పందన ఏమో తెలియదు. ఇది అధికారుల పనితీరుకు నిదర్శనం గడివేముల పంచాయతీ సెక్రెటరీ సొంత పనుల మీద నెలకు రెండుసార్లు సెలవుల మీద వెళ్లడం నిత్యకృత్యం. ఇక జెడ్పి సమావేశాలు అంటూ ఈ ఓ ఆర్ డి ఎంపీడీవో మండల కేంద్రానికి డుమ్మా కొట్టడం చెప్పుకుంటే చాంతాడంత సమస్యలు ఉన్న పరిష్కరించే నాధుడు లేక మండల ప్రజలు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు మండలం ఏ గుజరాత్ బార్డర్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో లేదు నంద్యాల నందికొట్కూరు మధ్యలో అందరికీ అనువుగా ఉన్న ఈ ప్రాంతంలో మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించడం మానేసి చాన్నాళ్లయింది.. కలెక్టర్ గారు మా మండలంలోని గడివేముల గ్రామంలో అధికారుల పని తీరు సమస్యలపై ఆకస్మిక తనఖి చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.