పిల్లల ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాల కార్యక్రమాన్ని చేపట్టిన సెకండ్ హగ్స్ .. మైగేట్
1 min read

హైదరాబాద్, న్యూస్ నేడు : నగరంలోని ఎంపిక చేసిన హౌసింగ్ సొసైటీలలో క్షేత్రస్థాయిలో వస్తు సేకరణకు గాను పిల్లల ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలకు భారతదేశవ్యాప్తంగా ఉన్న వెబ్సైట్ సెకండ్ హగ్స్ (Second Hugs), భారతదేశంలోని ప్రముఖ కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ అయిన మైగేట్తో భాగస్వామ్యం ఫిబ్రవరి 15న జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సెలెస్టియా (నానక్‌రామ్‌గూడ), ఇండిస్ వీబీ సిటీ (బొల్లారం), హిల్ కంట్రీ అపార్ట్మెంట్స్ (నిజాంపేట)లలో ఇంటరాక్టివ్ కియోస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అపార్ట్మెంట్లలో ఉండేవారు సెకండ్ హగ్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సరికొత్త ఉత్పత్తుల లభ్యతను తెలుసుకోగలిగారు. అదే సమయంలో, జాగ్రత్తగా, తక్కువ స్థాయిలో ఉపయోగించిన పిల్లల ఉత్పత్తులను ఎలా సజావుగా కొనుగోలు చేయవచ్చో, విక్రయించవచ్చో అర్థం చేసుకోవడానికి ఆయా కుటుంబ సభ్యులు సెకండ్ హగ్ బృందం సభ్యుల నుంచి వివరాలు తెలుసుకోగలి ఈ కార్యక్రమం, ముంబై, నవీ ముంబై, హైదరాబాద్‌లలో విస్తరించి ఉన్న ఒక పెద్ద బహుళ-నగర చొరవలో భాగం. ఇది భారతదేశం అంతటా తల్లిదండ్రులకు పిల్లల ఉత్పత్తులను కొనడం, అమ్మడాన్ని సులభం, సరసమైనది, అందుబాటులో ఉండేలా చేయడానికి సెకండ్ హగ్స్ కార్యాచరణను మరింత బలోపేతం చేస్తుంది.

