రెండవ దశ …కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా కార్యక్రమం
1 min read
అజీమ్ ప్రేమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో..వట్లూరు గురుకుల పాఠశాలలో శిక్షణా కార్యక్రమం
మే 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు కార్యక్రమాలు
కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ,అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా కార్యక్రమం రెండవ దశ ప్రారంభమైంది. ఏలూరు జిల్లాలోని వట్లూరులో,మే నెల ఒకటవ తారీఖు నుండి మూడవ తారీఖు వరకు మూడు రోజులు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంకు పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలలోని సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు హాజరవుతారు.నూతన పాఠ్య ప్రణాళికలు, బోధనా పద్ధతుల గురించి ఈ శిక్షణ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుందని వట్లూరు కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నుండి నందన్ కుమార్,ఐ.ప్రేమ లీలా కుమారి,ఏలూరు జిల్లా డి.సి.ఓ.ఉమా కుమారి, కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.