PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆర్ఆర్ఆర్`లో ఆ సీన్ చూస్తే స‌ర్క‌స్ లాంటి ఫీలింగ్ వ‌చ్చింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘ఆర్ఆర్ఆర్’పై వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఒక సర్కలా అనిపించిందని అన్నారు. సర్కస్ చూస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో… ఈ సినిమాలో వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా జెమినీ సర్కస్ చేస్తున్న ఫీలింగ్ తనకు కలిగిందని వ్యాఖ్యానించారు. మరోవైపు, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా వర్మ కోరడం గమనార్హం. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి జోష్ కలుగుతుందో అలాంటిదే ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిందని అన్నారు. ఒక సినిమా మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

                                      

About Author