నిస్వార్థ సేవలకు గుర్తింపు ఉంటుంది
1 min read
డాక్టర్ చంద్రశేఖర్ వైద్యునిగా అందించిన సేవలే వైస్ ఛాన్స్ లర్ ను చేశాయి…
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా…
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్డియాలజీ విభాగపు అధిపతి డాక్టర్ చంద్రశేఖర్ అందించిన వైద్య సేవలు ఆయనను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ను చేశాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.జి. జి, హెచ్ సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా నియమించిన సందర్భంగాశనివారం కార్డియాలజీ విభాగపు సమావేశ మందిరంలో నిర్వహించిన సన్మాన సభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… డాక్టర్ చంద్రశేఖర్ వైద్యులుగా జిల్లా ఆసుపత్రిలో పనిచేయడం అందరి మన్ననలు పొందడం వలన పదవీ విరమణ తర్వాత కూడా కార్డియాలజీ విభాగానికి అధిపతిగా కొనసాగిస్తూ ఉండడం , ఇక్కడే పనిచేస్తూ ఉండడం వలన ఆయన ఈ రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గా నియమింపబడ్డారని తెలిపారు. ఆయనను వైస్ ఛాన్స్ లర్ గా ఎన్నుకోవడం గొప్ప విషయం అని కలెక్టర్ తెలిపారు. ” మనం చేసే సేవలే మనకి గుర్తింపుని తీసుకు వస్తాయని ” జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి రాయలసీమ నుండి వైస్ ఛాన్స్ లర్ గా ఎన్నుకోబడ్డ మొట్ట మొదటి వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ అని తెలిపారు. మన డాక్టర్ వైస్ ఛాన్స్లర్ గా నియమింపబడడం వలన కర్నూలు మెడికల్ కాలేజీ కి మరియు జిల్లా ఆసుపత్రికి మరింత మంచి జరుగుతుందని , అదనంగా సౌకర్యాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… కర్నూలు జిల్లా పర్ల లోనే ఇంటర్మీడియట్ చదివాను, ఇక్కడే మెడికల్ కాలేజీ లో చేరానని తెలిపారు. వివిధ కోర్సుల అనంతరం కార్డియాలజీ విభాగంలో దాదాపు 20 సంవత్సరాల సేవలు చేస్తూ విభాగాన్ని అభివృద్ధి చేశానని, హాస్పిటల్ సూపరిండెంట్ గా కూడా పనిచేశానని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు, నాయకుల ఆశీర్వాదంతో ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా నియమింపబడ్డానని అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించి నాకు ఛాన్సలర్ గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలియజేశారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయని, అన్నింటిని సందర్శించిన తరువాత కార్యాచరణ సిద్ధం చేసుకుని చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సమయంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు , మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ డాక్టర్ చంద్రశేఖర్ సేవల ను కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ మహేష్ ఎండి ని , డాక్టర్ చంద్రశేఖర్ మరియు కలెక్టర్ పి.రంజిత్ బాషా ల ను సన్మానించారు.