NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల భద్రతకు శక్తి యాప్‌…

1 min read

మీ భద్రత మా భాధ్యత… మీ రక్షణే మా ధ్యేయం.

కర్నూలు శక్తి టీం పోలీసుల భరోసా.

కర్నూలు, న్యూస్​ నేడు:  అత్యవసర సమయంలో మహిళలు శక్తి SOS యాప్‌ వినియోగించుకోవాలని, ఈ యాప్‌ మహిళల భద్రత కోసమే ప్రత్యేకంగా రూపొందించిందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు మహిళా పియస్  డిఎస్పీ శ్రీనివాసాచారి పర్యవేక్షణలో మహిళా పియస్ సిఐ విజయలక్ష్మీ  ఆధ్వర్యంలోకర్నూలు , సుంకేశుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు  శక్తి యాప్‌ పై  అవగాహన కల్పించారు.ప్రతీ మహిళ శక్తి యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారి మొబైల్  కంట్రోల్‌ రూమ్‌కి కనెక్ట్‌ అవుతుందన్నారు. ప్రమాదంలో కానీ అత్యవసర సమాయాల్లో మొబైల్ ను 5 సార్లు షేక్‌ చేస్తే ప్రమాదంలో ఉన్నట్లు కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వస్తుందన్నారు.దగ్గర్లోని పోలీసులు 5 నిమిషాల్లో బాధిత మహిళల వద్దకు వచ్చి సహాయం చేస్తారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ యాప్‌ లో ఇంట్లో నుంచే ఫిర్యాదు చేయవచ్చన్నారు.మహిళల భద్రతకు పోలీస్‌ శాఖ కృషి చేస్తుందన్నారు.శక్తి టీం యొక్క పనితీరు, శక్తి SOS  యాప్  యొక్క ఉపయోగాలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్,  డయల్ 112, 181, చైల్డ్ లైన్  1098 , కర్నూలు పోలీసు వాట్సప్ 7777877700, సైబర్ క్రైమ్  టోల్ ఫ్రీ నెం 1930 యొక్క ఉపయోగాలు , ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, సోషల్ మీడియా ప్రభావం, చదువుకు ఉన్న ప్రాముఖ్యత, మొదలైన విషయాల  పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  మహిళ పియస్ సిఐ విజయలక్ష్మీ, శక్తి టీమ్ సిబ్బంది, కర్నూలు సెయింట్ జోసఫ్ కళాశాల  ప్రిన్సిపల్ డా. శాంత , లెక్చరర్లు పల్లవి, సునీత విద్యార్థినులు సుమారు 300మంది పాల్గొన్నారు.

About Author