NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింఛన్​లో వాటా.. అడిగారు..

1 min read

– సూర్య హాస్పిటల్​ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి
– డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసిన డయాలసిస్​ వ్యాధిగ్రస్తుడు
పల్లెవెలుగు వెబ్​, కడప: డయాలసిస్​ సర్టిఫికెట్​ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్​ ఇస్తుందని, అందులో తమకు వాటా కావాలని అడిగారని, నిరాకరించినందుకు వేధిస్తున్నారని సూర్య హాస్పిటల్​ వైద్యులపై ఓ డయాలసిస్​ వ్యాధిగ్రస్తుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్​బాషకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని వీరబల్లి మండలానికి చెందిన సిలార్​ సాహెబ్​ అనే వ్యక్తిడయాలసిస్​ వ్యాధిగ్రస్తుడు. కొన్నేళ్లుగా సూర్య హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్​ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేలు పింఛన్​ ఇస్తోంది. ఇందుకు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరగా.. సదరు వైద్యులు తమకు వాటా కావాలని అడిగారని, ఇందుకు నిరాకరించడతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని డిప్యూటీ సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత ఆరు నెలల నుంచి ముందు వచ్చి క్యూలో నిలబడినా తనను పట్టించుకోకుండా ఇతరులకు డయాలసిస్ చేస్తున్నారని, ఇదేంటయ్యా అని అడిగితే మెమింతేనని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ సీఎం.. సూర్య హాస్పిటల్​ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

About Author