శిలంబం శిక్షణ సమ్మర్ క్యాంప్ ప్రారంభం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 4వ వార్డు టిడిపి ఇంఛార్జి ఊట్ల రమేష్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి బాలాశివ జూనియర్ కళాశాలలో వేసవి శిలంబం (కర్ర సాము) శిక్షణ తరగతులు ప్రారంభించారుఅనంతరం ఆయన మాట్లాడుతూ శిలంబం శిక్షణ ఆత్మ రక్షణనను పెంపొందిస్తుందని శిలంబం శిక్షణ విద్యార్థులకు చక్కటి ఆరోగ్యంతో పాటు చక్కర శరీరం ఆకారం రావటానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఈ వేసవి కాలంలో విద్యార్థులు అందరూ బాగా శిక్షణ పొంది మంచి ప్రశంశలు పొంది మన కర్నూలుకు, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరడమైనది.శిలంబం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శిలంబం కోచేస్ బి రాఘవేంద్ర, మహావీర్, బహదూర్ మరియు 4వ వార్డు టిడిపి బూత్ ఇంఛార్జిలు సయ్యద్ భాష, నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.