శివ భక్తుల సేవలో… ‘జి.ఎన్.ఆర్’
1 min read
పాదయాత్ర భక్తులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ
కర్నూలు, న్యూస్ నేడు :సంపాదించిన దాంట్లో కొంతైనా సమాజ సేవకు ఉపయోగించాలని సూచించారు జి.ఎన్.ఆర్ హాస్పిటల్ అధినేత , ప్రముఖ న్యూరాల జిస్ట్ డా. నాగేశ్వరయ్య . కర్నూలు నగరం గాయత్రి ఎస్టేట్ లోని జి.ఎన్.ఆర్. హాస్పిటల్ అధినేత డా. నాగేశ్వరయ్య, సిబ్బంది పాదయాత్రగా వెళ్లే కన్నడ భక్తులకు శనివారం వాటర్ , మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. నాగేశ్వరయ్య మాట్లాడుతూ ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని .. ఎంతో భక్తి శ్రద్ధలతో పాదయాత్ర గా వెళ్లే భక్తుల( కన్నడిగులు) కు సేవ చేయడం ఎంతో అదృష్టమన్నారు. సామాజిక సేవలో ముందుంటామని పేర్కొన్న డా. నాగేశ్వరయ్య…. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని రాజకీయ నాయకులు, ప్రముఖ వైద్యులు ప్రశంసించారు.
