NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ముగిసిన షాప్ SAAP వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్                                       

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  కర్నూలు జిల్లా పత్తికొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో  సాప్ వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఘనంగా ముగిశాయి. వాలీబాల్ ముగింపు వేడుకపత్తికొండలో నిర్వహించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ – వాలీబాల్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శ్రీరామ హాస్పిటల్స్ ఎండి నీలకంఠ ,  పత్తికొండ ఎంఈఓ ఎస్. రమేష్ , ఆర్‌ఎస్‌ఎం షాపింగ్ మాల్, ఫిజికల్ డైరెక్టర్ ఎస్. చందు నాయక్, జిల్లా పీడీలు  పీఈటీల సంఘo కార్యదర్శి, యు. ధనుంజయ, కేవీకే స్టేడియం వాలీబాల్ కోచ్ క్రీడాకారులకు శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం. హరికుమార్  (పీడీ), మక్తూమ్ వలి (పీఈటీ), సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేత  ప్రశంస పత్రాలు, సర్టిఫికెట్లు మెమొంటాలను అందజేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించేందుకు ఇటువంటి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.సాప్ ఆధ్వర్యంలో వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించే అవకాశం కల్పించిన SAAP మరియు జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ (DSA) అధికారులకు ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ శిక్షకులు ఇ. రామాంజనేయులు , పీఈటీ, రాష్ట్ర వాలీబాల్ రిఫరీ, పత్తికొండ వాలీబాల్ సంఘo సభ్యులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *