NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోల్స్‌ రాయిస్‌తో సిగ్మా రూ.1,600 కోట్ల దీర్ఘకాలిక ఒప్పందం

1 min read

బ్రోమ్‌ఫోర్డ్‌ కొనుగోలు తర్వాత సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు మరో భారీ అవకాశం

హైదరాబాద్, న్యూస్​ నేడు : రక్షణ, ఏరోస్పేస్‌ రంగ సంస్థ సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు చెందిన, ఇటీవల కొనుగోలు చేసిన బ్రిటన్‌ అనుబంధ సంస్థ బ్రోమ్‌ఫోర్డ్‌ ప్రెసిషన్‌ సొల్యూషన్స్‌ ద్వారా రోల్స్‌ రాయిస్‌తో మరో దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. లీసెస్టర్‌లో ఉన్న బ్రోమ్‌ఫోర్డ్‌ ద్వారా ఈ ఒప్పందం కుదరడం, ఆ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా తక్షణమే కలిగిన వ్యూహాత్మక ప్రయోజనాన్ని చాటుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఏరోస్పేస్‌ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ (ఓఈఎం) సంస్థల్లో ఒకటైన రోల్స్‌ రాయిస్‌తో సిగ్మా గ్రూప్‌ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి ఇది దోహదపడనుంది.దాదాపు 125 మిలియన్‌ పౌండ్ల (సుమారు రూ.1,600 కోట్ల) విలువైన ఈ ఒప్పందం, ఇటీవల కుదిరిన సుమారు 300 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.3,800 కోట్లు) రోల్స్‌ రాయిస్‌ దీర్ఘకాలిక ఒప్పందానికి కొనసాగింపుగా ఉంది. కీలకమైన ఏరోస్పేస్‌ కార్యక్రమాల్లో సిగ్మా ఉత్పత్తుల పరిధి, తయారీ సామర్థ్యం, భాగస్వామ్యాన్ని ఇది మరింత విస్తరించనుంది. ఈ రెండు ఒప్పందాలు కలిపి రోల్స్‌ రాయిస్‌ బ్రిటన్‌ సరఫరా వ్యవస్థలో సిగ్మా స్థానాన్ని గణనీయంగా బలోపేతం చేయడంతో పాటు, దీర్ఘకాలంలో ఆదాయంపై మరింత స్పష్టతను కల్పించనున్నాయి. భారత్‌లో పెరుగుతున్న ఏరోస్పేస్‌, రక్షణ తయారీ వ్యవస్థకు అవసరమైన అధిక విలువ, దీర్ఘకాలిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఇదే. ఒక్కో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించుకుంటూ ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం’’ అన్నారు.

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ గురించి

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదైన సంస్థ. అంతర్జాతీయంగా కార్యకలాపాలను విస్తరిస్తున్న ప్రముఖ భారతీయ ఏరోస్పేస్‌, రక్షణ రంగ ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ సంస్థగా ఇది ఎదుగుతోంది. ఏరోస్పేస్‌, ఏవియానిక్స్‌, నౌకాదళ వ్యవస్థలు, రాడార్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు సంబంధించిన అత్యంత కీలకమైన వ్యవస్థలను సంస్థ స్వయంగా అభివృద్ధి చేసి, తయారు చేస్తోంది. ఇందుకోసం సొంతంగా అభివృద్ధి చేసిన బిల్డ్‌-టు-స్పెక్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యాలను వినియోగిస్తోంది. తన బ్రిటన్‌ అనుబంధ సంస్థలు నాస్మిత్‌, బ్రోమ్‌ఫోర్డ్‌ ద్వారా సిగ్మా ప్రపంచ ఏరోస్పేస్‌ సరఫరా వ్యవస్థలో బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓఈఎం ఖాతాదారుల కోసం అత్యంత క్లిష్టమైన తయారీ కార్యక్రమాలకు అవసరమైన సంక్లిష్టమైన, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన పరిష్కారాలను సంస్థ అందిస్తోంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *