PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

( సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ) మిషను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : 35 లక్షల రూపాయల విలు గల SDP( సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ) మిషను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు ప్రారంభించారు.మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు 35 లక్షల రూపాయల విలువ గల SDP( సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ) మిషన్ హైదరాబాదు Virchow ఫౌండేషన్ వారు డొనేషన్ గా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది.ఈ SDP.( సింగిల్ డోనర్ ప్లేట్లెట్ )మిషన్ ను జిల్లా కలెక్టర్ ప్పి.కోటేశ్వరరావు గారు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ బ్లడ్ ను సేకరిస్తుంటారని, బ్లడ్ అవసరం ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని సంస్థలోని సభ్యులను కొనియాడారు బ్లడ్ సేకరణ సమయంలో బ్లడ్ లో హాని కలిగించే వైరస్ లను తక్షణమే గుర్తించేలా అధునాతన టెక్నాలజీ తో తయారు చేయబడిన ఈ SDP( సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ) మిషనును మన కర్నూలు జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీలో మొట్టమొదటిగా వినియోగించడం చాలా గర్వంగా ఉందన్నారు, రెడ్ క్రాస్ సొసైటీ లోని సభ్యులు శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే మహశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అలాంటి సమయంలో కాలినడకన మరియు బస్సు మార్గములో వచ్చే భక్తులకు ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ.గోవిందరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం,First aid ట్రైనింగులు, యువకులను ప్రోత్సహించడానికి ప్రతి కాలేజీ నందు యూత్ రెడ్ క్రాస్ ,జూనియర్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నామని వారికి ప్రతి ఒక్కరికి స్వచ్ఛంద సేవలో భాగం చేస్తామని డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు SDP ( సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ) మిషన్ ఇచ్చినందుకు వికో ఫౌండేషన్ వారికి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున జిల్లా కలెక్టర్ గారు మరియు గోవింద రెడ్డి వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర కుమార్, ట్రెజరర్ J. రఘునాథరెడ్డి, జి .శ్రీనివాసులు, ఈసీ మెంబర్స్ Dr.కె వి సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు ,కే అరుణ , మధు బాబురాజు ,భీమా శంకర్ రెడ్డి, ఐ నరసింహ, మీనాక్షి, పుల్లయ్య కాలేజ్ అధినేత పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author