సింగిల్ చేప ఖరీదు 36 లక్షలు !
1 min readపల్లెవెలుగు వెబ్: పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మత్య్సకారుడు రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ నదులలో చేపలను వేటాడుతుండగా భారీ తెలియా భోలా చేపను పట్టుకున్నాడు. ఆ చేప సుమారు 7 అడుగుల పొడవు, 75 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ మేరకు మత్స్యకారులందరూ సమిష్టిగా కష్టపడితేనే ఆ భారీ చేపను ఒడ్డుకు తీసుకురాగలరు. అంతేకాదు ఆ చేపను హోల్‌సేల్ మార్కెట్‌కి తీసుకువెళ్లితే అక్కడ అనుహ్యంగా అత్యధిక ధర పలికింది. దీంతో ఆ తేలియా భోలా చేప కిలో రూ.49,300 చొప్పున మొత్తం సుమారుగా రూ.36 లక్షలకు విక్రయించారు. పైగా ఈ చేప పొట్టలో అత్యంత విలువైన వనరులు ఉంటాయని వాటిని మందులు, ఇతర వస్తువుల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.