PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిడ్నాప్ యత్నం కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్​

1 min read

– 5 సెల్ ఫోన్లు, ఒక కారు, 4000 నగదు స్వాధీనం..
– ఏలూరు ఇన్చార్జి డిఎస్పి ఫైడేస్వరరావు

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : కిడ్నాప్ యత్నం కేసులో ఆరుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు ఇన్చార్జ్ డిఎస్పి పైడేశ్వరరావు తెలిపారు. స్థానిక రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ ఏలూరు నగరంలో సివిల్ ఇంజనీర్ అయినటువంటి ఈడుపుగంటి నవరాజ్ సివిల్ కాంట్రాక్టర్ చేస్తూ ఉంటాడన్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన సింగంశెట్టి సత్యరాజు అలియాస్ దత్తి రాజు అనువారికి నవరాజుకు ఆర్థిక లావాదేవీలో గొడవ జరుగుతుండడంతో ఇదే అదునుగా తీసుకున్న సత్యరాజు బాపులపాడు మండలం వేలూరు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ అజయ్ కుమార్, నూజివీడు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రావూరి మల్లేష్ నాయక్, హనుమాన్ జంక్షన్ వేలేరు ప్రాంతానికి చెందిన బాణావతుల నాగబాబు, నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతానికి చెందిన భూకే రాజేష్, జంగారెడ్డిగూడెం మండలం నాగుల గూడెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు మధు అను వారితో కలిసి నవరాజ్ను కిడ్నాప్ చేయడానికి రూ 1,50,000ల కు వీరిని నియమించినట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీన ఏలూరు డి మార్ట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న భవనం పనులు పర్యవేక్షిస్తుండగా వీరు కిడ్నాప్ చేయబోతుండగా నవ రాజ్ కేకలు వేయడంతో చుట్టుప్రక్కల ఉన్న వారు రావడంతో వీరందరూ కూడా పరారయ్యారు అన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రత్యేక ఆదేశానుసారం ఏలూరు టూ టౌన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కేసును చాకచక్యంగా చేదించి ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఏ వన్ ముద్దాయి అయినటువంటి సింగంశెట్టి సత్యరాజు అలియాస్ దత్తి రాజు పై జంగారెడ్డిగూడెంలో వివిధ కేసులు నమోదయ్యాయని అలాగే రౌడీషీట్ కూడా ఉన్నదని తెలిపారు. ముద్దాయిల వద్ద నుండి తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారును, గ్లామర్ మోటార్ సైకిల్ ను, ఐదు మొబైల్ ఫోన్లను, 4000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసును రెండు రోజుల్లో చేదించిన ఏలూరు రెండో పట్టణ ఇన్చార్జి సీఐ కెవిఎస్ వరప్రసాద్ను, ఎస్సై ప్రసాదును, సిబ్బంది అప్పన్న, రఫీ, కనకాంబరం, ఇసాకులను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అభినందించారన్నారు.

About Author