NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉక్కు మహిళకు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మొట్టమొదటి మహిళా ప్రధానిగా విజయవంతంగా పాలన అందించిన వ్యక్తి ఇందిరా గాంధీ అని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుమనిషిగా పేరొందారని వీరి సేవలు చిరస్మరణీయమన్నారు రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల శకుంతల. ఆదివారం ఇందిరా గాంధీ 37వ వర్ధంతి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నగరంలోని అశోక్ నగర్ లోని పట్టణ మహిళా వసతి గృహంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఉక్కు మహిళా గా పేరొందారన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించిన వ్యక్తి ఇందిరాగాంధీ అని ఆమె తెలిపారు. దేశంలో దారిద్ర్యాన్ని నిర్ములించడానికి, దేశ ప్రజల కు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఇందిరా గాంధీ కృషి చేశారన్నారు. కార్యక్రమం లో మేనేజర్ జి. యామిని, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author