NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారాహీ నవరాత్రులలో భాగంగా శ్రీ మహా గౌరీ అమ్మవారికి విశేష అభిషేకం

1 min read

కర్నూలు,న్యూస్ ​నేడు:  జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ మాత్రేనమః శ్రీ శ్రీ శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆషాఢమాస (గుప్త నవరాత్రులు) వారాహీ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు  ప్రాతఃకాలంలో శ్రీ మహా గౌరీ అమ్మవారికి విశేష అభిషేకం,అర్చనలు జరిగినవి. అనంతరం మండపారాధన , శ్రీదేవి ఖడ్గమాల లలిత సహస్రనామ పూర్వక సామూహిక కుంకుమార్చనలు జరిగినవి. తిరిగి సాయంకాలం ప్రదోషకాలార్చన, శ్రీ వారాహీ సహస్రనామం,శ్రీ పాదుకానుష్టాన  పూజలు జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదములు స్వీకరించినారు.

About Author