PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్షయతృతీయ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి విశేష పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అక్షయతృతీయ సందర్బంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి మూలవిరాటకు ద్రాక్ష ఫలములతో విశేష అలంకారం నిర్వహించడం జరిగినది. అలాగే నవగ్రహ, గణపతి, సంపుటిత శ్రీ సూక్త హోమ సహిత స్వర్ణాకర్షణ భైరవ, లక్ష్మి కుబేర హోమ సహిత శ్రీ రాజశ్యామల మూల మంత్ర హోమం జరిగినది. భక్తులు ఈ హోమంలో పాల్గొని స్వర్ణాకర్షణ భైరవ లక్ష్మి కుబేర స్వాముల అనుగ్రహమునకు పాత్రులైనారు.

About Author