NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రమోషన్ల కొరకు కృషి చేసిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కోడుమూరు తాలూకా కార్యదర్శి అయినా చంద్రశేఖర్  ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ కామ్రేడ్ వీ జవహర్లాల్ ని మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న ని కర్నూల్ నగర అధ్యక్షులు ఎం రామకృష్ణ నీ వారి కార్యాలయం లో  మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ సందర్భంగా ప్రెస్ డెన్షియల్ ఆర్డర్ ప్రకారం జోనల్ క్యాడర్ వ్యవస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగులకు సంబంధించిన విషయ ములపై చర్చించడం జరిగినది. అంతేకాకుండా ఇటీవల  ప్రమోషన్  పై కడప నుంచి కర్నూలు డీవీఈఓ ఆఫీస్ సూపరింటెండెంట్ గా కర్నూలుకు వచ్చిన ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున  కూడా ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో నాయకులను కలవడం జరిగింది. ప్రమోషన్ పై వచ్చిన మల్లికార్జున కు కూడా జిల్లా సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్  ఉద్యోగులు సంఘం నాయకులు మాట్లాడుతూ మా శాఖకు సంబంధించి అన్ని ప్రమోషన్ల కొరకు ఎనలేని కృషిచేసినఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్కి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రంజిత్ భాషా,ఐఏఎస్​ కి మరియు ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది…ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రమణారెడ్డి, EC MEMBER బాల నరసయ్య ఇంకా ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author