NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినిమా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

1 min read

ఆర్‌అండ్‌బీ శాఖకు ఎస్‌డీపీఐ 7వ వార్డు, కాలనీ ప్రజల కృతజ్ఞతలు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుందలోని సినిమా రోడ్డుపై వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రజల భద్రతను కాపాడేందుకు నాలుగు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు ఎస్‌డీపీఐ 7వ వార్డు తరఫున, కాలనీ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇటీవల ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో సినిమా రోడ్డుపై నూతన తారు రోడ్డు ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణంతో వాహనాలు అధిక వేగంతో ప్రయాణించే అవకాశం ఉండటంతో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన ఎస్‌డీపీఐ 7వ వార్డు నాయకులు ప్రజల భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు మెమోరాండం అందజేశారు.ఎస్‌డీపీఐ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు సినిమా రోడ్డుపై నాలుగు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం పట్ల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడం తమ బాధ్యత అని ఎస్‌డీపీఐ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీపీఐ 7వ వార్డు ఇన్‌చార్జ్ కె. జావిద్ బాషా, ఈబీఆర్ అయూబ్, సామీయుల్లా, ముజీబ్ తదితరులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *