NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ మహాగణపతి నవరాత్రి మహోత్సవాలు

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి  ఆధ్వర్యంలో గణేశ చతుర్థి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా కమిటీ సభ్యుడు శ్రీపతి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఈ 10వ వార్షికోత్సవంగా  గణేష్ మహోత్సవములు  అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీ నుండి 6వ తేదీ వరకు శ్రీ గణేష్ పూజ మహోత్సవాలు  జరుగుతున్నాయని తెలిపారు.29 తేదీన కుంకుమ పూజ 30వ తేదీన గణపతి హోమం 31న కూచిపూడి భరతనాట్యము సెప్టెంబర్ 1వ తేదీన శివ పంచామృత అభిషేకం 2వ తేదీన హనుమాన్ చాలీసా 3 తేదీన అయ్యప్ప స్వామి భజన 5వ తేదీన ముగ్గుల పోటీ ఉట్టి కొట్టే కార్యక్రమంసెప్టెంబర్ 6 వ తేదీన  నాడు అన్నదాన కార్యక్రమం సుమారు 6000మందికి నిర్వహిస్తున్నామని ఆ తర్వాత  చీకటి అనూహ్య శివ నరేష్ వారు సిద్ధి వినాయకునికి సమర్పించిన 63 కేజీల లడ్డు  వేలం పాట నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.వినాయకుడి విగ్రహ దాత తిరుమలిశెట్టి విజయలక్ష్మి కి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం శ్రీ వరసిద్ధి వినాయకుని మేళ తాళాలతో పలుకులతో డీజే తీన్మార్ తో ఊరేగించి నిమజ్జన కార్యక్రమం కనుల పండువగా జరపనున్నట్లు వ్యక్తపరిచారు. శ్రీ గణేష్ పూజ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వినాయకుని ఆశీస్సులు పొందవలసిందిగా  భక్తులకు పిలుపునిచ్చారు.శ్రీ గణేష్ మండపము ఏర్పాటుకు మహోత్సవములు నిర్వహించేందుకు పోలీస్ శాఖ వారు సింగిల్ విండోస్ పద్ధతి ప్రకారం ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చి తమకు ఎంతో సహకరించారని ఈ ఆన్లైన్ పద్ధతి వలన సింగిల్ విండో ద్వారా చాలా సులభంగా పర్మిషన్లు పోలీస్ శాఖ నుండి లభించాయని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నుండి కూడా అన్ని పర్మిషన లభించేందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమానికి శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి కమిటీ సభ్యులు శ్రీపతి కిషోర్ ఆదుకోరే రాము మోహన్ రాజు బచ్చు గోపి కిరణ్ కనకజం రవితేజ సన్నగా శెట్టి జై కృష్ణ కౌగింతల ప్రకాష్ రాజు, మరియు స్థానిక పెద్దలు భక్తులు  తదితరులు పాల్గొన్నారు.

About Author