గోదాగోకులంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ నృసింహ ఇష్టి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని మామిదాలపాడు సమీపంలో వెలసిన శ్రీగోదా గోకులం నందు శ్రీ నృసింహ ఇష్టి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆగమ సార్వభౌమ శ్రీ మద్వాధూల సముద్రాల రమాకాన్తాచార్య స్వామి వారి అధ్వర్యంలో ఈ యజ్ఞం జరిగినది.ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామిజీ భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.శ్రీ నృసింహ స్వామి ఉపాసన చేస్తే సమస్తమైన శుభాలు కలుగుతాయని, సకల శత్రు బాధలు తొలగిపోతాయని, నృసింహ మంత్రవైభవాన్ని వివరించారు. అంతే కాకుండా శ్రీ గోదాగోకులం వల్ల కర్నూలు పట్టణం మరో శ్రీరంగపట్టణం అవుతున్నదని వివరించారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి వ్రతధర శ్రీనివాస నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామీజీ, గోదాగోకులం వ్యవస్థాపక చైర్మన్ మారం నాగరాజ గుప్త మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు,వేద పండితులు శ్రీమన్నారాయణా చార్యులు, మాధవాచార్యులు, భగవాన్ ఆచార్యులు, రమేశ్ ఆచార్యులు,రంగనాథాచార్యులు, వంశీకృష్ణమాచార్యులతో పాటు అనేక మంది ఋత్విక్కులు పాల్గొన్నారు. అలరించిన గోదా కళ్యాణరూపకం : గోదాగోకులంలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గోదా కళ్యాణరూపకం కూచిపూడి నృత్యం శ్రోతలను ఎంతగానో అలరించింది. కర్నూల్ నగరానికి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య అకాడమీ వ్యవస్థాపకులు బి.నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో కుమారి దేవిశ్రీ బృందం ప్రదర్శించిన నృత్య రూపకం వీక్షకులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ వై.రామయ్య, యువ పారిశ్రామికవేత్త టి.జి.వి. భరత్, కార్పోరేటర్ విక్రమసింహా రెడ్డి, డిఎఫ్.ఒ. పల్లె శివశంకర రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, పాలాది సుబ్రహ్మణ్యం,ఇల్లూరి రామయ్య, బాలసుధాకర్, చిత్రాల వీరయ్య, భూమా కృష్ణ మోహన్, వేముల జనార్ధన్, రవిప్రకాష్, లింగం కృష్ణ మోహన్, గోదాగోకులం పరివారంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.