శ్రీరామ … రవీంద్ర విద్యానికేతన్ పాఠశాలను సీజ్ చేయాలి
1 min read

ప్రైవేట్ పాఠశాల వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి
కోసిగి రోడ్లో ధర్నా మరియు రాస్తారోక చేసిన విద్యార్థి సంఘ నాయకులు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేని శ్రీరామ పాఠశాల మరియు రవీంద్ర విద్యానికేతన్ పాఠశాలను సిజ్ చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ పాఠశాలాల బయట మరియు కోసిగి రోడ్ లో ధర్నా నిర్వహించి రాస్తరోక చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు ఉదయ్ శేఖర్ ఆఫ్రిది రఘునాథ్ కృష్ణ కాజా సురేష్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో అర్హత లేని ఉపాధ్యాయులు చే బోధించడం జరుగుతుందని సరైన వసతులు లేకపోయినా విద్యార్థులు తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ దీనికి ఆధానంగా బుక్స్ యూనిఫామ్ మిగతా ఫీజు లతో కలిపి విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది,అదేవిధంగా బస్సులకు వ్యాన్లకు సరైన ఫిట్నెస్ లేకుండా పరిమితికి మించి విద్యార్థులను పశువుల్లా ఎక్కించుకొని తరలించడం జరుగుతుంది అని వారు ఆరోపించారు . ఇవే కాక పాఠశాలల్లోనే వారి గృహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వారు వంట చేసుకునేటటువంటి వంటగ్యాస్ అనుకోని ప్రమాదం జరిగితే విద్యార్థులకు ప్రాణహాని తలెత్తే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్ల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,కొన్ని తరగతి గదుల్లో ఫ్యాన్ల విద్యార్థులు ఉక్కపోత కీ గురువుతున్నారు. కొన్ని పాఠశాలలకు ఫైర్ పర్మిషన్ లోను గ్రౌండ్ పర్మిషన్ విషయంలోనూ ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేకపోయినా ఎంఈఓ ఆంజనేయులు ప్రైవేట్ పాఠశాలల దగ్గర ముడుపులు తీసుకుని పర్మిషన్లు లేకపోయినా ఉన్నాయాని సృష్టించడం జరిగింది. కావున పై విద్యాధికారులు ఎమ్మిగనూర్ ప్రైవేటు పాఠశాలకు వత్తాసు పలుకుతున్న మండల విద్యాధికారి ఆంజనేయులు ను సస్పెండ్ చేసి శ్రీరామ రవీంద్ర విద్యా నికేతన్ పాఠశాలలను సీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

