మిడుతూర్ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ గా శ్రీదేవి..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ గా బీటీ శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈమే తిరుపతి జిల్లా ఎర్రవారి పాలెం మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి బదిలీపై వచ్చినట్లు ఆమె తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఎస్.సలీం భాష పదోన్నతిపై అమరావతి హెడ్ ఆఫీస్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) గా వెళ్లారు.పదవ తరగతి మరియు ఇంటర్ ఫలితాల్లో ప్రతి ఏడాది కూడా మండలంలోనే ఈ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచారంటే ప్రిన్సిపాల్ సలీం భాష కృషి ఎంతగానో ఉందని చెప్పవచ్చు.పది మరియు ఇంటర్ లో మెరుగైన ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తానని నూతన ప్రిన్సిపాల్ శ్రీదేవి అన్నారు.