నవోదయం2.0 అమలు ను సమీక్షించిన రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ,ఐ.పీ.ఎస్ . కర్నూలు జిల్లా ఎక్సైజ్ అధికారులతో నవోదయం2.0 అమలు తీరును, జిల్లా ఉద్యోగుల పని తీరు ను సమీక్షించారు. నేడు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జిల్లా డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు డి.పి .ఈ. ఓ .మరియు ఏఈఎస్ లతో జిల్లాలోని నాటు సారాయి, సుంకం చెల్లించని అక్రమ మద్యం, గంజాయిని అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు మరియు వీటి పై నమోదు చేసిన కేసు ల పురోగతిపై సమీక్షించి, నవోదయం పకడ్బందీగా నిర్వహించి కర్నూలు ను సారా రహిత జిల్లాగా ప్రకటించడానికి అందరూ కృషి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్స్సైజ్ అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్ నుండి బార్డర్ చెక్ పోస్టుల పనితీరును పరిశీలించారు. చెక్ పోస్టు లలో నిఘా ను పెంచి అక్రమ మద్యం జిల్లా లోకి రాకుండ అడ్డుకట్ట వేయాలని కోరారు. అదే విధంగా రీజనల్ ఎక్స్సైజ్ లేబొరేటరీ ను అందులోని పరికరాలను పరిశీలించి ల్యాబ్ పనితీరును సమీక్షించారు. రిపోర్ట్ లు తయారు అయిన వెంటనే సంబందిత స్టేషన్ లకు స్పెషల్ మెసెంజర్లు ల ద్వారా పంపాలని ,జిల్లా కార్యాలయం ఆవరణం మొత్తం కలియ తిరిగి ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. తదుపరి మాధవరం చెక్ పోస్టు ను ఆకస్మిక తనిఖీ చేశారు. డైరెక్టర్ వెనుక డిప్యూటీ కమిషనర్ శ్రీ మతి. శ్రీదేవి , అసిస్టెంట్ కమిషనర్ శ్రీ. హనుమంతరావు , జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ. సుధీర్ బాబు , AES లు, రాజశేఖర్ గౌడ్, రామక్రిష్ణ రెడ్డి, సి. ఐ లు రాజేంద్ర ప్రసాద్ , జయరాం నాయుడు మరియు చంద్రహాస్ లు పాల్గొన్నారు.అనంతరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ మరియు మెంబర్స్ కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిబాబు మెంబర్స్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచాన్ని అందించడం జరిగింది.
