PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలి

1 min read

– పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ లు తగిన చర్యలు తీసుకోవాలి.

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్  ఆదేశాల మేరకు, శ్రీ టి. సర్కార్ కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ వారి ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి సూచనల మేరకు ఆదివారం జిల్లా పోలీసు శిక్షణ కార్యాలయంలో ” పోలీసు, న్యాయవ్యవస్థ లు మానవ హక్కుల ఉల్లంఘనల పై సోషల్ మీడియా లో దాని ప్రభావం” అను అంశం మీద జిల్లా పోలీసు సిబ్బందికి చర్చ వేదిక (డిబేట్) కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఇందులో సిఐ లు, ఎస్ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, మరియు కానిస్టేబుళ్లు మొత్తం 70 మంది పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.సోషల్ మీడియాలో ఎవరైనా వ్యక్తిగత జీవితాలను ఇబ్బందులకు  గురి చేయరాదు.ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసు, న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలి.అనే అంశాలపై ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు న్యాయ న్యాయ నిర్ణేతలుగా శ్రీ ఎల్. సుధాకర్ రెడ్డి, డి.ఎస్.పి, దిశ పియస్ కర్నూలు, శ్రీ బి. లక్ష్మీనారాయణ సీనియర్ అడ్వకేట్, జర్నలిస్టు, డిస్ట్రిక్ కోర్ట్ కర్నూల్. డాక్టర్ శ్రీ ఎం శివాజీ రావు Principal, శ్రీ ప్రసూన కాలేజ్ ఆఫ్ లా, కర్నూల్. పాల్గొన్నారు.ఈ సమావేశంలోప్రతిభ కనబరిచిన వారిని న్యాయ నిర్ణేతలువిజేతలుగా నిర్ణయించారు.

ఇందులో…

ఇంగ్లీష్ బాష కేటగిరి నందు

1) Sri S Mansuriddin, CI, Kodumur Circle &

 Sri K Ramesh, Cl, DPTC, Kurnool.

2) P Sobha Rani, WSI, Kurnool Taluk UPS

 & M Khaleel Baig, PC 289, Ecops, Kurnool,

 తెలుగు భాష కేటగిరి నందు 1) Lakshmi Devi, WPC 4225, Ullindakonda PS .& K Madhu Babu, PC 3302, Ullindakonda PS 2) పి కిరణ్ కుమార్, పిసి 924, ఓర్వకల్ పిఎస్ & ఎల్ రవి ప్రకాష్, పిసి 762ఓర్వకల్  పిఎస్ .ఈ కార్యక్రమ నందు శ్రీ కె రమేష్ డిటిసి ఇన్స్పెక్టర్, కర్నూల్. శ్రీ గుణశేఖర్ బాబు DCRB ఇన్స్పెక్టర్,శ్రీ ఎస్ మన్సూరిద్దీన్, సిఐ, కోడుమూరు సర్కిల్, ఎస్సైలు మరియు డిటిసి సిబ్బంది పాల్గొనడం జరిగినది.ఈ డిబేట్ నందు ప్రతిభ కనబరిచిన వారిని రేంజ్ లెవెల్ డిబేట్ కు పంపడం జరుగుతుంది.

About Author