‘ఆత్మకథ’ విక్రయాలు నిలిపివేయండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : రేమండ్ గ్రూపు సంస్థల చైర్మన్ విజయ్ పత్ సింఘానియా ఆత్మకథ ‘ఎన్ ఇన్ కంప్లీట్ లైఫ్ ’ అమ్మకాలు, సర్కులేషన్, డిస్ట్రిబ్యూషన్ పై బాంబే హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ పుస్తకం విషయంలో విజయ్ పత్ కు , విడిపోయిన ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియాతో పాటు రేమండ్ కంపెనీతో న్యాయవివాదం నెలకొంది. పుస్తకంలో పేర్కొన్న విషయాలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, గోప్యత హక్కును ఉల్లంఘించడంతో పాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఇతర రహస్య సమాచారాన్ని చర్చించారని గౌతమ్ సింఘానియా ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ఈ పుస్తకం అమ్మకాలు, ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించింది.