హీరో రాజశేఖర్ ఇంట విషాదం !
1 min read

పల్లెవెలుగు వెబ్ :ప్రముఖ హీరో రాజశేఖర్ ఇంట విషాధం నెలకొంది. పండుగ వేళ ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్నై డిసిపిగా రిటైర్డ్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజశేఖర్ రెండవ కుమారుడు. వరదరాజన్ గోపాల్ భౌతిక కాయాన్ని చెన్నై తీసుకెళ్లనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

