NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి పర్యటనకు  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి 

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు : ఈ నెల 17 వ తేదీన జిల్లాలో  ముఖ్యమంత్రి పర్యటన  సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు  చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.బుధవారం  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 17 వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో   ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 17 వ  తేదీన ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారని, అక్కడి నుండి సి క్యాంప్ రైతు బజార్ లో  ముఖ్యమంత్రి  స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.  రైతు బజార్ లో  ముఖ్యమంత్రి ఇద్దరు పారిశుధ్య కార్మికులు, ఇద్దరు రైతులతో మాట్లాడతారన్నారు. అనంతరం నగరం లోని  కేంద్రీయ విద్యాలయ సమీపంలో  ఏర్పాటు చేసిన  ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.ఈ సారి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర  థీమ్ ” బీట్ ది హీట్”  అనే అంశం వల్ల జరుగుతోందన్నారు..అందుకనుగుణంగా సి క్యాంపు రైతు బజార్ తో పాటు  నగరంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర సందర్భంగా తగిన పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రైతు బజార్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని,ఆదోని సబ్ కలెక్టర్ సహాయకులుగా ఉంటారని కలెక్టర్ తెలిపారు..ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సి క్యాంపు రైతు  బజార్ లో తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  అధికారులను ఆదేశించారు. బ్యాక్ డ్రాప్, సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాట్లు చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. సీఎం పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ తగిన బందోబస్త్ ఏర్పాట్లు చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రజా వేదిక వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ బి ఎస్ ఈ ని ఆదేశించారు. అదే విధంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు రెండు పిజిఆర్ఎస్ కౌంటర్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. విద్యుత్ సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ని ఆదేశించారు.. సౌండ్ సిస్టమ్ అరేంజ్మెంట్, ఇంటర్నెట్ కనెక్షన్ లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు.. ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నీ ఆదేశించారు.. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు…మెడికల్ క్యాంప్ లు, ఓ ఆర్ ఎస్, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ డిఎమ్హెచ్ఓ ను ఆదేశించారు.. పార్కింగ్ ప్రదేశాలను గుర్తించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎస్పీ, ఆర్డీఓ, ఆర్ అండ్ బి ఎస్ఈ లను ఆదేశించారు.సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, ఆర్డీవోలు భరత్ నాయక్, సందీప్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చిరంజీవి, అజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, కొండయ్య, అనురాధ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తో కలిసి రైతు బజార్, కేంద్రీయ విద్యాలయ పక్కన ప్రజా వేదిక ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.. తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.. పర్యటనలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *