విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు
1 min read– రాజారామ్ కొల్లే,వ్యక్తిత్వ వికాస నిపుణులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చునని వ్యక్తిత్వ వికాస నిపుణులు రాజారామ్ కొల్లే అన్నారు కర్నూల్ నగరంలో సాయి సుబ్బయ్య రవీంద్ర హైస్కూల్ లో జరుగుతున్న పినాక శిక్షణ తరగతులకు ఆయన చెన్నై నుంచి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థిని విద్యార్థులు జీవితంలో ఎంతటి లక్ష్యాలను అయినా చేరుకోవచ్చునని దానికి ఉదాహరణగా ఐఆర్ఎస్ అధికారి బి యాదగిరి,డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ లు నిలుస్తారని వారు గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ఐఆర్ఎస్ అధికారిగా, డాక్టర్ గా విధులు నిర్వహించడమే గాక గత పది సంవత్సరాలుగా రాయలసీమలోని ఎంతోమంది విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడం కోసమే పినాక సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారని అలాగే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండి క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తే తప్పక సఫలం అవుతాయని విద్యకు క్రమశిక్షణ కలిగిన జీవన విధానం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. పినాక కర్నూల్ సెంటర్ కోర్స్ డైరెక్టర్&రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాస నిపుణులు రాజారామ్ కొల్లే పినాక శిక్షణ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో పినాకలో శిక్షణ పొందిన విద్యార్థుల విద్యార్థులు గొప్పస్థాయిలో ఉండాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సునీతారోస్,జోసఫ్ నోయల్,యశోద,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్,మదాసి మాదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బలరాం,ఎర్రకోట మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.