నందికొట్కూర్ మున్సిపాలిటీ మేనేజర్ గా సుహ్రులత..
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ మేనేజర్ గా ఎం.సుహ్రులత శుక్రవారం మధ్యాహ్నం మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.ఈమే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ బదిలీల్లో భాగంగా పదోన్నతిపై బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు.ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్న మధుబాబు ఏడు నెలలు ఇన్చార్జి మేనేజర్ గా ఇప్పటి వరకు ఉన్నారు.పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.