భారత ఫుట్ బాల్ సమాఖ్య పై సస్పెన్షన్ వేటు !
1 min readపల్లెవెలుగువెబ్ : అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు ఊహించని షాక్ తగిలింది. ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల ప్రమేయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫిఫా వెల్లడించింది. సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకు ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఈమేరకు చర్యలకు ఉపక్రమించినట్లు వివరించింది. ఈ విషయంపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపింది.