వడ దెబ్బ లక్షణాలు.. ప్రథమ చికిత్స పై అవగాహన
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఆయుష్ మందిర్ లో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్. రఘు తనిఖీ చేశారు, అనంతరం మాట్లాడుతూ వడ దెబ్బ లక్షణాలు – మరియు ప్రథమ చికిత్స గురించి అవగాహనా కల్పించాలని వైదధికారి కి సూచంచినారు. ఎండలు తీవ్రముగా ఉన్నప్పుడు మనిషి శరీరములో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్ర మం డల నాడి వ్యవస్థ దెబ్బ తినడం వలన వడదెబ్బ వస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతుంది. వడదెబ్బ తగిలిన వారిలో 40% మరణాలు సంభవిస్తాయి. ఇది చాల ప్రమాదకరమైనది.వేసవి కాలములో సాధారణoగా అపాయానికి గురి చేసేది వడదెబ్బ దానినే సన్ స్ట్రోక్ లేదా హీట్ స్ట్రోక్ అంటారు. తీవ్ర స్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదము కూడా ఉంది. కనుక వడ దెబ్బ తగిలిన వ్యక్తికి తక్షణమే వైద్య సహాయం అందించాలి.
లక్షణాలు :- 1.తలనొప్పి 2.తలతిరగడము 3.నాలిక ఎండి పోవడము/ పిడచ కట్టుకుపోవడము /చెమట పట్టుకుండుట. 4.ఎండి పోయిన చర్మముతో ఎక్కువ జ్వరం కలిగి ఉండడం 5. మగత కలవరింతలు 6. ఫిట్స్ 7. పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.
కారణాలు :– 1. శరీరంలో ఎక్కువ వేడి ఉత్పతి కావడం 2. శరీరం ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడము.చేయవలసిన పనులు :- 1.వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. 2. అతని శరీరం పై వుండే దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగడము కానీ, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవడము చేయాలి. 3.ఐస్ ముక్కలను గుడ్డతో ఉంచి శరీరాన్నితుడిచి, చల్లని గాలి తగిలేలా చూడాలి. 4.రోగస్త్రులకు చల్లని నీరు లేదా ఉప్పు మరియు ఇతర లవణాలు కలిపిన నీటిని త్రాగించాలి. ఓ.ఆర్. యస్ – ద్రావకాన్ని త్రాగించాలి.అయితే ఇవన్ని భాదితునికి డాక్టరుకి చూపించే లోగా చేయవలసిన చర్యలు. స్పృహ కోల్పోతే మాత్రము సమయం వృధా చేయకుండా వైద్య సహాయం అందే ఏర్పాటు చేయాలి.ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలు.50 సంవత్సరముల వయస్సుపై బడినవారు తమ ప్రయాణాలలో ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్స్ వెంట తీసుకొనివెళ్ళాలి. వేడిమి ఎక్కువగా ఉన్నచోట ఎక్కువ శ్రమతో కూడిన పనిచేయడం ఉదా: హోటల్స్ వంటగదుల్లో పనిచేసేవారు, కార్మికులు, రైతులు, నిర్మాణపనులు, ఇటుక బట్టీలలో పనిచేయువారు, రక్షకభటులు, రోడ్డుప్రక్కన వ్యాపారం చేయు చిరువ్యాపారులు మరియు ఎండలో ప్రయాణం చేసేవారు. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, పసిపిల్లలు.ముఖ్యంగా రేకుల షెడ్డులో నివసించేవారు అధిక జాగ్రతలు తీసుకోవాలి.అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉదా: గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహము కలవారు.వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలుసాద్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో 12 గo. నుండి 4 గం. వరకు తిరగకుండా జాగ్రత్త వహించాలి.తప్పని సరిగా బయటకువెళ్ళ వలసిన పరిస్థితులలో ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఉప్పు కలిపిన పళ్ళ రసాలు త్రాగి బయలుదేరాలి.వేసవి కాలములో తెల్లని దుస్తులు ధరించాలి, నల్లని వస్త్రాలు ధరించకూడదు.ఆల్కాహాల్ సేవించడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ చెమట వచ్చేలా చేస్తాయి. అది విషమ పరిస్థితి కి దోహదం చేస్తుంది. కనుక ఆల్కహాల్ సేవించరాదు.ఇంటి గదులు ఉష్ణోగ్రతను తగ్గించడానికి కిటికీలకు తలుపులకు తెరలను వాడి వేడిని తగ్గించవచ్చును. ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వాడాలి.వేడిగా ఉన్నపుడు ఎండలో గొడుగు లేకుండా తిరుగరాదు.తప్పనిసరి పరిస్థుతలలోమండుటెండలో బయటికి వెళ్ళాలంటే మంచి నీటి బాటిల్ ని వెంట తీసుకోని వెళ్ళాలి.వేసవికాలంలో బయటకు వెళ్ళే అవసరం ఉంటే ఉదయం/సాయంత్రం సమయాలలో వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి.తలకు తెల్లని టోపీ లేక రుమాలు లేకుండా ఎండలో తిరుగరాదు. వడదెబ్బకు గురి అయిన వారు కోలుకుంటున్న లక్షణాలు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని హాస్పిటల్ చేర్చటంలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.ఈ కార్యక్రమంలో వైదధికారి సుజాత , వైద్య సిబ్బంది కరుణ, చముండే శ్వారి, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.